అక్కడ బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిన 2.0

2.0 telugu

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అక్షయ్ కుమార్ విలన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 2.0. ఈ సినిమా ఇప్పటికే విజయవంతంగా రెండు వారాలను పూర్తి చేసుకొని మూడవ వారంలో అడుగుపెట్టింది. విడుదలకు ముందు నుండే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదల తరువాత బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపిందనే చెప్పాలి.

చెన్నై బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా అక్కడ ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ చేసింది. కేవలం 11 రోజుల్లో 18.41 గ్రాస్ ఒక్క చెన్నై ఏరియాలో రాబట్టిది. అయితే బాహుబలి 2 అక్కడ టోటల్ రన్ లో 18.50 కోట్లు వసూలు చేయగా.. 2.0 కేవలం 11 రోజుల్లో 18.41గ్రాస్ వసూలు చేసింది. అయితే గట్టిగా చెప్పాలంటే మరో రోజుతో ఈ రికార్డు బ్రేక్ అవుతుంది.