ఓవర్సీస్ లో దుమ్ములేపుతున్న 2.0

2.o-bahubali

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 2.ఓ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ తో దుమ్ములేపుతోంది. ఈ సినిమా ఇప్పటికే 12 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటికే 600 కోట్ల వరకు గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా తాజా సమాచారం ప్రకారం ఓవర్సీస్ దుమ్ములేపుతోది.

ఇప్పవరకు అక్కడ 5 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలను సాధించి నాన్ బాహుబలి రికార్డు బ్రేక్ చేసింది. అయితే లాంగ్ రన్ లో ఈ సినిమా బాహుబలి , బాహుబలి 2 రికార్డులను క్రాస్ చేస్తుందా అంటే.. అదీ కష్టమే అని చెప్పాలి.

బాహుబలి ఓవర్సీస్ లో లాంగ్ రన్ లో 6.9 మిలియన్ డాలర్లు గ్రాస్ వసూలు చేయగా.. బాహుబలి 2 అయితే ఏకంగా 20 మిలియన్ మార్కును టచ్ సంచలనం సృస్టించగా.. ఇప్పుడు చిట్టీ ఆ రికార్డు బ్రేక్ చేయడం కష్టంగా మారిందనే చెప్పాలి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో 50 కోట్ల వరకు షేర్ వసూలు చేసిన ఈ సినిమా మరో 20 కోట్ల వరకు వసూలు చేయాల్సివుంది.

Related Posts:

Telugu Movie news : 2.0 13 Days Box Office Collections