సాహో కు 20 కోట్లతో భారీ సెట్..అదిరిపోయే యాక్షన్ సీన్స్!

saaho news

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం సాహూ.. విడుదలకు ముందు నుండే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలోవుంది. ఇప్పటికే చాల వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. సాహూ సినిమాలో హీరో విలన్ మధ్య వచ్చే యాక్షన్ 20 కోట్ల ఖర్చుతో
ఒక భారీసెట్ వేస్తున్నారట.

అయితే ఇది బాంద్రా-వర్లీ సీ ‌లింక్ బ్రిడ్జ్‌ను పోలి ఉంటుందట. ముందుగా ముంబైలోని… బాంద్రా-వర్లీ సీ ‌లింక్ బ్రిడ్జ్ మీద ఈ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించాలని భావించారట. కానీ అక్కడ షూటింగ్ కు అనుమతి లభించకపోవడంతో.. రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్ వేస్తున్నారట.

ప్రభాస్ బాహుబలి వంటి భారీ విజయం తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రేక్షకుల అంచనాలను మించే విధంగా.. 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు..

అయితే అందులో 100 కోట్లకు పైగా కేవలం యాక్షన్ సీన్లకే ఖర్చు పెడుతుండడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ సరసన హీరొయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ నటిస్తుండగా సాహూ సినిమాను వరల్డ్ వైడ్ గా ఆగష్టు 15న భారీ ఎత్తున విడుదలకు సిద్ధం చేస్తున్నారు.

Telugu Movie News: 20 cr new set saaho movie