విచ్చలవిడిగా తిరుగుతోంది చూడు అంటూ కామెంట్స్ చేశారు !

actress jyothi

వ్యాంప్ తరహా పాత్రలు చేసే నటి జ్యోతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తాజాగా ఆలీతో సరదాగా అనే ప్రోగ్రాం పాల్గొన్న నటి జ్యోతి తన సినీ జీవితం గురించి, వ్యక్తిగత జీవితంలో ఎదురైన సమస్యల గురించి సంచలన విషయాలు తెలియజేసింది.

2002లో మందారం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జ్యోతి..ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల వలెనే తనకు మంచి గుర్తింపు లభించిందని ఆమె అన్నారు. అయితే ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ.. నాకు చాలా యంగ్ ఏజ్ లోనే నాకు వివాహం అయింది.

నేను నా భర్త విడాకులు తీసుకొని విడిపోయాం. నాకు ఒక కోడుకు ఉన్నాడు మా ఇద్దరి గొడవల వలన వాడికి తండ్రి దూరమయ్యాడనే భాద నన్ను ఎప్పుడూ భాదపడుతోనే ఉంటుంది అంటూ జ్యోతి కంటతడి పెట్టుకుంది. ఒక సంధర్బంలో వ్యాంప్ పాత్రలు చేయడం వలన విచ్చలవిడిగా తిరిగేస్తోంది చూడు అంటూ కామెంట్స్ కూడా చేశారని.. ఆ కష్టాలన్నీ కట్ చేస్తే ప్రస్తుతం నా కొడుకుతో చాలా హ్యాపీ గా ఉంటున్నానని ఆమె అన్నారు.

Telugu Movie News : actress jyothi about her personal life