త్రివిక్రమ్ సినిమాలో మాస్ లుక్ లో బన్నీ..ఈ సారి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పక్కా!

allu arjun latest movie

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా తీయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అల్లు అర్జున్ మూడవ సినిమా కావడం ఇంతక ముందు వీరి కంబినేషన్ లో వచ్చిన “జులాయి, సన్నాఫ్‌ సత్యమూర్తి” సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్‌
సాదించడంతో ఈ సినిమాపై అభిమనుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

allu arjun trivikram Movie Updateఅసలే అరవింద సమేత సినిమాతో తనలోని మాస్ యాంగిల్ ను భయటపెట్టిన త్రివిక్రమ్.. బన్నీకి కూడా ఒక మాస్ హిట్ ఇవ్వాలని భావిస్తున్నాడట. అయితే ఈ సినిమాకోసం బన్నీ ఇప్పటికే జిమ్ లో కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం.

నాపేరు సూర్య సినిమా తరువాత కాస్త బరువు పెరిగిన అల్లు అర్జున్ రోజుకి 8 గంటల పాటు జిమ్ లో తెగ కష్టపడుతున్నారట. ఎస్‌.రాధాకృష్ణ, అల్లు అరవింద్‌ కలిసి ఈ సినిమాను భారిఎత్తున తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ నెల చివరికల్లా ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Telugu Movie News: Allu arjun special diet trivikram movie #AA19