ఎన్టీఆర్ కెరీర్ లోనే..167కోట్ల తో అల్ టైం రికార్డ్ !!

aravinda sametha 28 days box office collections

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం “అరవింద సమేత” మూడు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకొని నాలుగవ వారంలో తన రన్ కొనసాగిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డ్రాప్స్ సొంతం చెసుకుంటున్నా.. మొత్తానికయితే నిర్మాతలకు గట్టి లాభాలు తెచ్చిపెట్టింది.

అరవింద సమేత ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 103 కోట్ల పైగా గగ్రాస్ కలెక్షన్స్ వసూలు చేయగా.. టోటల్ వరల్డ్ వైడ్ గా 167 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే 167 కోట్ల గ్రాస్ మార్క్ అందుకోవడం ఇది రెండవ సారి. ఇంతక ముందు వచ్చిన జై లవ కుశ ఈ ఫీట్ ను సాధించింది. అరవింద సమేత అక్టోబర్ 11న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది.

ఈ సినిమా ఇప్పటికే కొన్ని థియేటర్స్ ను కోల్పోగా.. కలెక్షన్స్ పరంగా మాత్రం కొంత వరకు బాక్స్ ఆఫీస్ వద్ద తాజాగా వస్తున్న సినిమా ల నుండి పోటీఎదుర్కోంటూ.. విజయపదంగా దూసుకుపొతుంది. అరవింద సమేత మొత్తం లాంగ్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

Ntr Aravinda Sametha 28 Days Box Office Collections