బిగ్ బాస్ లోకి వెళితే ఆ సినిమాకు దెబ్బే!!

Bigg Boss 2 Telugu
Bigg Boss 2 Telugu
Bigg Boss 2 Telugu a flop show for movies :

నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ 2కు మొదటిలో అంత పాజిటివ్ రెస్పాన్స్ రాకపోయిన ముందు ముందు 3 వారాలు గడిచేసరికి జనాలను తనవైపుకు తిప్పుకుంటుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా బిగ్ బాస్ జపమే అంటే అతిసయుక్తి కాదేమో. అయితే బిగ్ బాస్ సంగతి బాగానే ఉంది. ఇక ఫ్రీగా ప్రమోషన్ చేసుకోవచ్చుకదా అని లోపలికి వెలుతుంన్న సినిమా స్టార్ల సినిమాలకు చేదు అనుబవం ఎదురవుతోంది. ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ – 2 లో ప్రమోషన్స్ కు వచ్చిన సినిమాలు నిరాశను ముగిల్చాయి.

ముందుగా “జంబలకిడిపంబ” ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీనివాసరెడ్డి బిగ్ బాస్ లోకి వచ్చి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తొందని అన్నారు తిరా చూస్తే డిజాస్టర్ అయ్యింది. అలాగే మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ “తేజ్ ఐ లవ్ యు” మంచు లక్ష్మి “వైఫ్ ఆఫ్ రామ్” కూడా ఇలానే దెబ్బకొట్టాయి. ఈ మూడు సినిమాలు బిగ్ బాస్ కు వెళ్ళి దెబ్బ తినడంతో మిగతా సినిమాల వారు బిగ్ బాస్ వద్దు బాబో అంటున్నారు.