ముందు పవన్‌ కళ్యాణ్ తో అనుకున్నారు..తరువాత రవితేజ తో..చివరికి ఎవరవుతారో ?

ravi teja

వరుస ఫ్లాపులతో అభిమానులను నిరాశ పరుస్తున్న రవితేజ తాజా చిత్రం అమర్ అక్బర్ ఆంటోని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద చేతులెత్తేసింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలయిన ఈ సినిమా నిర్మాతలకు భారీ దెబ్బకొట్టింది. అమర్ అక్బర్ ఆంటోని ఇటు రవితేజ కెరీర్ లోనూ అటూ దర్శకుడు శ్రీనువైట్ల కెరీర్ లోనూ భారీ ఫ్లాప్ గా మారిన సంగతి తెలిసిందే.

గత కొన్నేళ్ళుగా టాలీవుడ్ కు దూరంగా వుంటూ బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న ఇలియానా అమర్ అక్బర్ ఆంటోని సినిమాతో రవితేజ సరసన హీరొయిన్ గా రీఎంట్రీ ఇచ్చినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. రవితేజ తో సినిమా అంటే ఆ సినిమా యావరేజ్‌గా ఉన్నా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిసేది.

కానీ గత మూడు సినిమాలనుండి ఈ సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది. రవితేజ ఈ మధ్య తీసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా నిరాశపరిచాయి. అయితే ప్రస్తుతం రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఆ సినిమా తరువాత కోలీవుడ్ సూపర్ స్టార్ ఇళయ దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన తేరి సినిమాను తెలుగులో ముందుగా పవన్ కళ్యాణ్ తో తీయాలని అనుకున్నారట.

పవన్ పార్టీ పనుల్లో బిజీ కావడంతో ఈ సినిమాను రవితేజ తో చేయాలని మైత్రి మూవీస్ అనుకోగా.. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. అయితే అమర్ అక్బర్ ఆంటోని తరువాత రవితేజ తో ఈ సినిమాను చేయడానికి మైత్రి మూవీస్ కాస్త తడబడుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.

Related Posts:

పట్టాలెక్కిన #RRR..తారక్ , చెర్రీకి నో బ్రేక్

“సైరా” లో నయనతార ఎలా ఉందో చూడండి.

500 కోట్లు.. “ఆర్ఆర్ఆర్” బిజినెస్ ఇది!!

‘రిపబ్లిక్ డే’కి వస్తున్న హీరో సూర్య ?

అరవింద సమేత అక్కడ బాక్స్ ఆఫీస్ వద్ద ఇండస్ట్రీ రికార్డు కొట్టింది!

Telugu Movie News : After Amar Akbar Anthony debacle, budget of Ravi Teja’s next gets heavily slashed?