మహానాయకుడు సినిమాను చంద్రబాబు ముందే చూస్తాడట!

NTR BIOPIC

సినియర్ ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి కానుకగా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద గోరపరాజయం పాలయింది. సినిమా మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాకూడా.. ఈ సినిమాపై ఎక్కవగా యూత్ ఆసక్తి చూపక పోవడంతో
సినిమా నిర్మాతలకు భారీ నష్టాన్ని మిగిల్చింది.

అయితే ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు దెబ్బతో.. ఎన్టీఆర్ బయోపిక్ రెండవ భాగమయిన ఎన్టీఆర్ “మహానాయకుడు” ఫై ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోని.. ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తూ.. సినిమాను చాలా ఆసక్తికరంగా మారుతున్నారు.

అయితే ఈ సినిమా ఎడిటింగ్ మొత్తం అయిపోయిన తరువాత చిత్రబృందం చంద్రబాబుకు ప్రత్యేకంగా షో వేసి చూపించనున్నారని సమాచారం. మరో పక్క భారీ నష్టాలు తెచ్చిపెట్టిన ఎన్టీఆర్ కథానాయకుడు బయ్యర్లకు భారీ దెబ్బ కొట్టడంతో ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను ఫ్రీ నష్టపోయిన డిస్టిబ్యూటర్లకు ఇవ్వాలని అనుకుంటున్నారనే సమాచారం గట్టిగా వినిపిస్తోంది.

Telugu Movie News: Ntr kathanayakudu Box office collections, chandrababu is going to be seen before release Ntr Mahanayakudu Movie,

Related Posts: