ప్లాప్ ల హీరో సినిమాకు దిమ్మతిరిగే బిజినెస్!

Chitralahari doing good business:

Chitralahari
Chitralahari

“నేను శైలజ” ఫెమ్ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ “చిత్రలహరి” రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. వరుస ఫ్లాపులతో నెట్టుకొస్తున్న సాయిధరమ్ తేజ్ కు ఈ సినిమా గట్టి హిట్ గా నిలుస్తుందని ఇప్పటికే అర్ధమైపోగా ఈ సినిమా ఏప్రిల్ 12న విడుదలకు సిద్దమవుతోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం శాటిలైట్ రైట్స్ మరియు డబ్బింగ్ రైట్స్ ఇంకా ప్రైమ్ వీడియో రైట్స్ తో పాటు థియేట్రికల్ రైట్స్ ను అన్నీ కలుపుకొని ఈ సినిమా బిజినెస్ ఏకంగా 25 కోట్లకు చేరిందట. ప్రస్తుతం వరుస ఫ్లాపులతో ఉన్న హీరో నటించిన సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై నిర్మిస్తున్నారు.

Related Posts: