“లక్ష్మీస్ ఎన్టీఆర్” తో వారికి దిమ్మతిరిగే షాకిచ్చిన వర్మ!

80

election commission no objection to rgv lakshmis ntr:varma laksmis ntr

“ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌” వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశానంటాయి. ఈ సినిమా ప్రమోషన్ విషయంలో వర్మ ఎక్కడా తగ్గుతున్నట్టు కనిపించడంలేదు. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? లేదా..? ఎల‌క్ష‌న్ క‌మీష‌న్‌ ఈ సినిమాను అడ్డుకుంటుందా.. అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

చంద్రబాబు ను ఫుల్ నేగిటీవ్ రోల్ లో ఈ సినిమాలో చూపిస్తుండడంతో అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని నిన్నటివరకు అనుకున్నాం. కాగా ఎల‌క్ష‌న్ క‌మీష‌న్‌ ఈ సినిమా రిలీజ్ ని మేము అడ్డుకోలేం అంటూ క్లారిటీ ఇచ్చేసింది. గత నాలుగు రోజులుగా ఎల‌క్ష‌న్ క‌మీష‌న్‌తో ఏకదాటిగా చ‌ర్చ‌లు జ‌రిపిన రాష్ట్ర ఎన్నిక‌ల అధికారి ర‌జ‌త్‌కుమార్ “ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌” ఈ సినిమాను అడ్డుకోలేమని చెప్పడంతో ఈ సినిమా మార్చ్ 22న ఎటువంటి ఆటంకం అడ్డులెకుండా రిలీజ్ కు సిద్దమవుతుంది.

గ‌త కొన్ని రోజులుగా “ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌” సినిమాపై ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న టీడీపీ నేత‌లు ఈ విషయం తెలిసిందే. ఒక వేల సినిమా రిలీజ్ తరువాత సినిమాలో ఏదయినా సన్నివేశాలు వివాదాస్ప‌దంగా అనిపిస్తే.. అప్పుడు చిత్ర బృందంపై చ‌ర్య‌లు తీసుకునే వీలుంటుంద‌ని న్నిక‌ల అధికారి ర‌జ‌త్ కుమార్ స్ప‌ష్టం చేసారు.

Related Posts: