ఆ రెండు సినిమాల రికార్డులను చిత్తు చిత్తు చేసిన F2

సంక్రాంతి బరిలో విడుదలయిన తెలుగు సినిమాలు మూడు అందులో రెండు సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అవ్వగా వెంకీ వరుణ్ హీరోలుగా నటించిన F2 మాత్రం పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయింది.

అయితే మొదటి రెండు రోజుల్లో వినయ విధేయ రామ , ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి రేస్ నుండి తప్పుకాగా.. వెంకీ వరుణ్ ల F2 సినిమా మాత్రం ఇప్పటికి కూడా దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేస్తుంది.
అయితే తాజాగా F2 మొదటి 19 రోజులను విజయ వంతంగా పూర్తి చేసుకొని దిమ్మతిరిగే కలెక్షన్స్ ను బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వసూలు చేసింది.

ఇప్పటికే 70 కోట్ల క్లబ్ లో చేరి గీత గోవిందం మరియు దువ్వాడ జగన్నాథం సినిమాల రికార్డులను బ్రేక్ చేయగా.. తాజాగా రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర , సరైనోడు రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది.

మగధీర సినిమా తెలుగు వర్షన్ కి గాను 73.6 కోట్ల షేర్ వసూలు చేయగా..సరైనోడు తెలుగు వర్షన్ కి 73 కోట్ల షేర్ వసూలు చేయగా.. ఇప్పుడు తాజాగా F2 ఆ రెండు రికార్డులను బ్రేక్ చేస్తూ.. టోటల్ గా 74.15 కోట్ల షేర్ ని వసూలు చేసి సంచలనంగా నిలిచింది.

Telugu Movie News: F2 20 Days Box Office Collections

Related Posts: