F2 కుమ్ముడు మామూలుగా లేదు..రికార్దులకే చెమటలు పట్టిస్తోంది.

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ ల కనక వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ 25 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకోగా..తాజాగా మూడు వారాలు ముగిసేలోపు 74 కోట్ల షేర్ కలెక్షన్స్ అందుకుంది.

సినిమా మొదటి 25 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 76 కోట్ల కు పైగా షేర్ వసూలు చేయగా.. ఇప్పటికి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ దూసుకుపోతుంది. F2 సినిమా వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ కేరీర్ లో టాప్ సినిమాగా నిలిచింది.

34.5 కోట్ల కి సినిమాని అమ్మగా.. 76 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి 41.5 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది ఈ సినిమా. అయితే మొత్తం లాంగ్ రన్ ముగిసే సమయానికి F2 80 కోట్ల షేర్ మార్క్ ను అవలీలగా దాటే అవకాశముంది. మరి F2 టోటల్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో చూడాలి.

Telugu Movie News: F2 25 Days Box Office Collections