F2 టోటల్ కలెక్షన్స్..దిమ్మతిరిగే షాక్ ఇది!

85

f2 movie total box office collections:

వెంకటేష్ వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ F2. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపింది. రావడమే పెద్ద సినిమాలతో పోటిగా వచ్చిన సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

టాలీవుడ్ లో అత్యధిక షేర్ వసూలు చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ మద్యే 50 రోజులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం టాప్ 10 చిత్రాల జాబితాలో టాప్ 8వ స్థానంలో నిలిచింది. అయితే F2 టోటల్ రన్ లో రెండు తెలుగు రాష్ట్రాలలో 66.15 కోట్ల షేర్ వసూలు చేయగా టోటల్ వర్డల్ వైడ్ గా 81.05 కోట్లు షేర్ వసూలు చేసింది.

నైజాం – 22.8 కోట్లు
సీడెడ్ – 8.7 కోట్లు
ఉత్తరాంధ్ర – 10.50 కోట్లు
తూర్పు గోదావరి – 7 కోట్లు
పశ్చిమ గోదావరి – 4.3 కోట్లు
కృష్ణ – 5.2 కోట్లు
గుంటూరు – 5.6 కోట్లు
నెల్లూరు – 2.05 కోట్లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కలిపి మొత్తం షేర్ రూ. 66.15 కోట్లు
ఇతర చోట్ల – 5.60 కోట్లు
ఓవర్సీస్ – 9.30 కోట్లు
మొత్తం షేర్ రూ. 81.05 కోట్లు

Related Posts: