KGF 4వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..మామూలుగా లేవు!

Kgf 4 Days Box Office Collections

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ KGF బాక్స్ ఆఫీస్ వద్దా దుమ్ములేపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ట్రైలర్ మరియు టీజర్ విడుదల సమయం నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా.. ఆ అంచనాలే సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి.
అయితే తాజాగా ఈ సినిమా మొదటి 4 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది.

కేవలం కన్నడ లోనే కాక తెలుగు తమిళ్ హిందీ భాషల్లో కూడా ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతోంది. మొదటి ౩ రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 5 కోట్లు గ్రాస్ వసూలు చేయగా..కేరళలో 80 లక్షల గ్రాస్ , తమిళ్ లో 2.6 కోట్ల గ్రాస్ , కర్ణాటక లో 37 కోట్ల గ్రాస్ అలాగే హిందీలో 12 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండియా మొత్తం మీద 57.4 కోట్ల గ్రాస్ వసూలు చేసింది..

అలాగే ఓవర్సీస్ లో 2.7 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా మొత్తం ౩ రోజుల్లో వరల్డ్ వైడ్ గా 31 కోట్ల షేర్ ను 60.1 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక నాలుగవ రోజు గుంటూరులో 4,50,701 వసూలు చేయగా కృష్ణా లో 5,86,297 షేర్ వసూలు చేసింది. ఇంకా మిగిలిన ఏరియాలు తెలియాల్సి ఉండగా సినిమా మొదటి నాలుగు రోజుల్లో RTC X Roads లో 12,05,125 గ్రాస్ వసూలు చేసింది.

Related Posts:

రెండు తెలుగు రాష్ట్రాలలో “పేట” బిజినెస్ చూస్తే మైండ్ బ్లాక్!

అభిమానులకు షాకిస్తున్న “పేట” రన్ టైమ్!

పడి పడి లేచే మనసు ౩వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..మైండ్ బ్లాక్!

అంతరిక్షం ౩వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇవే!

ఓవర్సీస్ లో మేత మోగిస్తున్న కేజియఫ్

Telugu Movie News : Kgf 4 Days Box Office Collections