మహర్షి నుండి దుమ్ములేపే సాంగ్ వచ్చేస్తోంది!

103

maharshi first song release date:maharshi song

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మక 25వ సినిమాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “మహర్షి“. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ లోకనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకోగా.. ఈ సినిమాలో ఫైట్ సీన్స్ చాలా
అద్భుతంగా వచ్చాయట.

మహర్షి సినిమాకు దేవిశ్రీ సంగీతం అందిస్తుండగా.. ఈ సినిమాకు దేవిశ్రీ సంగీతం హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం హోలీ సందర్బంగా మార్చ్ 21 మహర్షి సినిమా నుండి ఒక రొమాంటిక్ లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారట.
ఈ సినిమాలో ప్రత్యేకంగా ఉండబోతుందట. మహేష్ బాబు పూజా హెగ్డే రొమాన్స్ ఈ పాటలో కనిపించనుంది.

ఇప్పటికే టాకీ పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇంకా రెండు పాటలను చిత్రీకరిస్తే మహర్షి షూటింగ్ మొత్తం కంప్లిట్ అయినట్టే. ఏప్రిల్ రెండవ వారంలో ఈ రెండు పాటలను చిత్రీకరించబోతున్నారట. మహేష్ బాబు ఇప్పటివరకు చేసిన సినిమాలలో ఈ సినిమా ది బెస్ట్ మూవీగా ఉండబోతుందట. వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తోంది. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మే 9న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Related Posts: