మహర్షి బిజినెస్..దిమ్మతిరిగే షాక్ ఇది!

Mahesh Babu maharshi movie business:

maharshi business
maharshi business

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి. రిలీజ్ కు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా మే 9 న రిలీజ్ కానుంది. మహేష్ బాబు 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీగానె అంచనాలు పెంచుకున్నారు.

maharshi movie teaser
maharshi movie teaser

అయితే ఈ సినిమాపై పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్‌ ఏకంగా 11 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రపోషిస్తుండగా పూజా హెడ్గేహీరొయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దేవిశ్రీ సంగితమందించిన మహర్షి ఫస్ట్ సాంగ్ యూటూబ్ లో వ్యూస్ పరంగా దుమ్ములేపుతుంది

Maharshi Movie digital rights
Maharshi Movie digital rights

Maharshi Business Update:

ప్రస్తుతం ఈ సినిమా ఎంత చేస్తుంది అనేది ఆసక్తి కరంగా మారగా.. ఇప్పుడు అందుతున్న ట్రేడ్ ఇన్ సైడ్ సోర్స్ ప్రకారం… మహర్షి సినిమా థియేట్రికల్ రైట్స్ బిజినెస్ 90 కోట్ల రేంజ్ లో జరగనుందట. మరి శాటిలైట్ – డిజిటల్- డబ్బింగ్ రైట్స్- ఆడియో రైట్స్ అలాగే ఇతర రైట్స్ అన్నీ కలుపుకొని మరో
40 నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరగనుందట.

maharshi teaser update
maharshi teaser update

ప్రస్తుతం అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే ఆంధ్రా 40కోట్ల, నైజాం 18 కోట్ల, సీడెడ్ 15 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగే అవకాశముంది. ఇక ఓవర్సీస్ లో మహర్షి సినిమా అటు ఇటుగా 15 కోట్లు పలుకుతుంది.
అసలే మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25వ సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటే మాత్రం అవలీలగా 100 కోట్ల షేర్ వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి మహర్షి రిలీజ్ తరువాత ఏ రేంజ్ లో రికార్డ్స్ బద్దలు కొడతాడో చూడాలి.

Related Posts:

Related Posts:

#maharshi #mahesh Babu #telugu Movie nEWS #TOLLYWOOD