అక్కడ దిమ్మతిరిగే రేంజ్ లో “మహర్షి” బిజినెస్!

184

Maharshi Movie Overseas Locations Count:maharshi news

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి. మహేష్ బాబు 25వ సినిమాగా ఎన్నో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ చాలా సార్లు మారగా ఫైనల్ గా ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 9న రిలీజ్ కు సిద్దమయింది.

మహర్షి సినిమాకు దగ్గరలో మరే సినిమా లేకపోవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే కలెక్షన్స్ సాధించడం కాయంగా కనిపిస్తోంది. భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఓవర్సిస్ లో కూడా భారీ ఎత్తున రిలీజ్ కు సిద్దమవుతుంది.

అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మహర్షి సినిమా అక్కడ 300 లకు పైగా లోకేషన్స్ లో రిలీజ్ కానుందట. ఓవర్సిస్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా దిమ్మతిరిగే రేంజ్ లో ఉండబోతుందని సమాచారం. మహేష్ బాబు కెరీర్ లోనే ఎక్కువ రేటులో ఓవర్సిస్ లో మహర్షి ప్రీ రిలీజ్ బిజినెస్ జరగనుందని సమాచారం.

Related Posts:

#RRR లో రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో అదిరిపోయే సాంగ్!
ప్రభాస్ పెళ్లి అప్పుడే జరగనుంది.
“సైరా” కోసం రంగంలోకి దిగుతున్న రామ్ చరణ్..!
మహేష్ బాబు అభిమానులకు శుభవార్త!
దిమ్మతిరిగే ధర పలికిన సాహో ఓవర్సీస్ రైట్స్ ..