మహర్షి టీజర్ ఆరోజయినా వస్తుదా ?

Mahesh Babu Maharshi Teaser release Date:

Mahesh Babu Maharshi Teaser release Date
Mahesh Babu Maharshi Teaser release Date

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ మహర్షి సినిమా కోసం ఎంతో ఆశగా ఎదరుచూస్తున్నారు. ఇప్పటికే సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించిన మహేష్ బాబు ఫాన్స్ కు ఈ వార్త అంతగా ఆనందాన్ని ఇవ్వలేకపోయింది. అయితే ప్రస్తుతం వారు ఎదరుచూస్తోంది మహర్షి సినిమా టీజర్ కోసమట, ఈ సినిమా టీజర్ ఎప్పుడు వస్తుందా అని వెయ్యికళ్ళతో ఎదరుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ హోలికి రిలీజ్ చేస్తారేమో అనుకుంటే.. అదీ జరగలేదు.

ఇప్పుడు ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇదేకనుక నిజమయితే మహేష్ బాబు అభిమానులకు పండుగనె చెప్పాలి. మహర్షి సినిమా మే 9న రిలీజ్ కు సిద్దమవుతుండగా ఈ సినిమాలో మహేష్ బాబు సరసన హీరొయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. మహేష్ బాబు 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

Related Posts: