మహర్షి” టీజర్ ఈ నెలలోనే రానుందా..?

120

Maharshi Teaser Update:

maharshi teaser update

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగ్ ప్రతిష్టాత్మక 25వ సినిమా వస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి. విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మహర్షి సినిమా టీజర్ ను ముందుగా వచ్చే నెల ఉగాది కానుకగా విడుదల చేయాలని అనుకున్నారు. అయితే తరువాత మాత్రం ఈ సినిమా టీజర్ హోలీ సందర్భంగా ఈ నెల 21 న రిలీజ్ చేయాలనుకుంటున్నాట.

అయితే ఈ టీజర్ రిలీజ్ డేట్ పై అధికారికంగా ప్రకటన రాలేదు కానీ ఈ నెల 21 న మహర్షి టీజర్ వచ్చేందుకు ఎక్కువశాతం అవకాశముందంటున్నారు. ఇదే కనుక నిజమయితే మహేష్ బాబు అభిమానులకు పండుగే అని చెప్పాలి. మహేష్ బాబు సరసన హీరొయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా ఈ సినిమాకు వంశి పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

Related Posts: