విక్రమార్కుడు సీక్వెల్ లో మహేష్ బాబు..జక్కన్న భారీ ప్లాన్

151

Mahesh Babu in Vikrama’s sequel:

ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమాతో బిజీ బిజీగా గుపుతున్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా మే 9 న విడుదల కానుంది. మహేష్ బాబు మహర్షి సినిమా తరువాత ఎఫ్ 2 దర్శకుడు అనిల్ రావిపూడితో ఒక సినిమా చేయనున్నాడు. అయితే ఈ రెండు సినిమాల తరువాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడట.

ప్రస్తుతం రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి #RRR సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఇప్పటికే మూడు షడ్యూల్లను పూత్తి చేస్కున్న ఈ సినిమా 2020 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా తరువాత రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమా చేయనున్నాడట. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఈ సినిమా విక్రమార్కుడు సినిమాకు సీక్వెల్ గా ఉండబోతుందట.

జక్కన్న దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడంటే మహేష్ బాబు అభిమానులకు పెద్ద పండుగలాంటి వార్త అనే చెప్పాలి. కానీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరాలవుతున్న ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మహేష్ బాబు కాని రాజమౌళి కానీ స్పందిస్తే తప్ప అసలు నిజమేంటి అనేది తెలియదు.

Related Posts: