అదిరిపోయే డైలాగ్స్ తో “మహర్షి” టీజర్

Mahesh Babu Maharshi Teaser:

maharshi teaser
maharshi teaser

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి. రిలీజ్ కు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా మే 9 న రిలీజ్ కానుంది. మహేష్ బాబు 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీగానె అంచనాలు పెంచుకున్నారు.

mahesh babu play to army officer role in anil ravipudi movie
mahesh babu play to army officer role in anil ravipudi movie

అయితే ఈ సినిమాపై పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్‌ ఏకంగా 11 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రపోషిస్తుండగా పూజా హెడ్గేహీరొయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దేవిశ్రీ సంగితమందించిన మహర్షి ఫస్ట్ సాంగ్ యూటూబ్ లో వ్యూస్ పరంగా దుమ్ములేపుతుంది.

maharshi movie teaser
maharshi movie teaser

సూపర్ స్టార్ మహేష్ ఫాన్స్ మహర్షి టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు వెయ్యికళ్ళతో ఎదరుచూస్తునారు. భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహర్షి టీజర్ ఉగాది కానుకగా ఏప్రిల్ 6న రిలీజ్ కానుంది.

maharshi teaser update
maharshi teaser update

ఇప్పటికే టీజర్ కటింగ్.. ఇతర కార్యక్రమాలు పూర్తయినట్టు సమాచారం. అయితే ఈ టీజర్ అటు మాస్ ఆడియన్స్ మరియు ఇటు క్లాస్ ఆడియన్స్ బాగా నచ్చే విధంగా ఉండబోతుందని సమాచారం. మహేష్ బాబు ఈ టీజర్ రెండు అదిరిపోయే డైలాగ్స్ కూడా చెప్పాడట.

Related Posts:

#maharshi #mahesh Babu #telugu Movie nEWS #TOLLYWOOD