మహర్షి సెట్స్ లో దేవ్ హంగామా..!

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఎంతో ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ మహర్షి. వంశీ పైడిపల్లి దర్శత్వంలో పూజ హెగ్డే హీరొయిన్ గా ఈ సినిమా ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకేక్కుతుంది. విడుదలకు ముందు నుండే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా షూటింగ్ నుండి లికయిన ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తమిళ హీరో కార్తీ మహర్షి చిత్ర సెట్ లో సందడి చేసాడు. దర్శకుడు వంశీపైడిపల్లి మహేష్ తో తమిళ హీరో కార్తీ సరదాగా మాట్లాడుతున్న ఈ ఫోటో మహేష్ బాబు అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్న మహర్షి చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.