నైజాం ఏరియాకి 6 కోట్లకు అమ్మితే 6 రోజుల్లో వచ్చింది ఇది!

majili 6 days box office collections:

majili 6 days box office collections
majili 6 days box office collections

నాగ చైతన్య, సమంత జంటగా తమపెళ్లి తరువాత మొట్టమొదటి సారిగా కలిసి నటించిన చిత్రం మజిలీ. రిలీజ్ కు ముందునుంచే టీజర్ మరియు ట్రైలర్ లతో మంచి అంచనాలు నెలకొన్న ఈ సినిమా రిలీజ్ తరువాత బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతుంది. ఈ సినిమా మొదటి 5 రోజుల్లో మంచి కలెక్షన్స్ సాధించింది. చాలా ఏరియాల్లో మజిలీ బ్రేక్ ఈవెన్ అవ్వగా..

ఈ సినిమా మొదటి 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 21.65 కోట్ల షేర్ రాబట్టి నిర్మాతలను సేఫ్ జోన్ కు తీసుకుపోయింది. ప్రస్తుతం ఎన్నికల ప్రభావం మజిలీ సినిమాపై పడినా మొదటి 5 రోజుల్లోనే ఈ రేంజ్ లో కలెక్షన్స్ అంటే మామూలు విషయంకాదనే చెప్పాలి. నాగ చైతన్య కెరీర్ లోనే మొదటి 5 రోజుల్లో ఎక్కువ షేర్ వసూలు చేసిన సినిమాగా మజిలీ నిలిచింది.

మజిలీ నైజాం ఏరియాలో 6వ రోజు 0.70 కోట్ల షేర్ వసూలు చేసింది. అయితే మొదటి 6 రోజుల్లో నైజాం 7.54 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ సినిమాను నైజాం ఏరియాకి గాను 6 కోట్లకు అమ్మగా మొదటి 6 రోజుల్లో 7.54 కోట్ల షేర్ వసూలు చేసింది.

telugu movie news: