22 గంటల్లోపే.. దిమ్మతిరిగే వ్యూస్

Majili Trailer Crosses 3 Million Digital Views In Less Than 22 Hrs:

Majili Trailer Crosses 3 Million Digital Views In Less Than 22 Hrs
Majili Trailer Crosses 3 Million Digital Views In Less Than 22 Hrs

సమంత హీరొయిన్ గా నాగ చైతన్య హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మజిలీ. సమంత నాగ చైతన్య తమ పెళ్ళి తరువాత జంటగా నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.

ఈ ట్రైలర్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసినట్టు యూటూబ్ వ్యూస్ చూస్తే అర్దమవుతుంది. ‘సిగ్గుండాలిరా.. పెళ్లాం దగ్గర డబ్బులు తీసుకోవడానికి.. తినే తిండి.. కట్టుకునే బట్ట.. ఆఖరికి తాగే మందు కూడా భార్య సంపాదన మీదే..?’’

అంటూ రావు రమేశ్‌ డైలాగ్‌ తో ప్రారంభమయిన ఈ ట్రైలర్ రిలీజ్ అయిన 22 గంటల లోపే మూడు మిలియన్ల డిజిటల్ వ్యూస్ ను సాధించి సినిమా పై ఉన్న అంచనాలు ఎంటో నిరూపించుకుంది. గోపి సుందర్ మరియు తమన్ కలిసి సంగీతమందించిన ఈ సినిమా ఏప్రిల్ 5వ వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.

Related Posts:

Samantha on About Majili Movie, Nagachaitanya maliji trailer release, maliji,