చిరంజీవి బయోపిక్‌పై నాగబాబు షాకింగ్ కామెంట్స్

135

nagababu Shocking Comments on chiranjeevi biopic:

megastar chiranjeevi biopic

ఈ మధ్య కాలంలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. కొన్ని బయోపిక్ లు బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తుండగా మరి కొన్ని బయోపిక్ లు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ దెబ్బతిన్నాయి. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ రాబోతుందంటూ ఈ సినిమాకు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించనున్నాడంటూ సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చెక్కర్లు కొట్టినా అవి వట్టి పుకార్లుగానే మిగిలిపోయాయి.

అయితే తాజాగా చిరంజీవి బయోపిక్ పై తాజాగా నాగబాబు స్పందించాడు. మెగాస్టార్ చిరంజీవి బయోపిక్ రాదని.. అసలు ఈ బయోపిక్ తీయాలనే ఆలోచనే మాకులేదని.. అలాగే చరణ్ కూడా దీనికి ఎట్టిపరిస్థితిలో ఒప్పుకోడని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. అన్నయ్య జీవితం అందరికి ఆదర్శంమే కానీ బయోపిక్ చిత్రానికి సెట్ అవుతుందని నేను అనుకోవడం లేదు అని సావిత్రి, సంజు లాంటి చిత్రాలని నిజాలు తెలుసుకునేందుకు ప్రేక్షకులు చూసారని నాగబాబు అన్నారు.

Related Posts:

అక్కడ దిమ్మతిరిగే రేంజ్ లో “మహర్షి” బిజినెస్!
#RRR లో రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో అదిరిపోయే సాంగ్!
ప్రభాస్ పెళ్లి అప్పుడే జరగనుంది.
“సైరా” కోసం రంగంలోకి దిగుతున్న రామ్ చరణ్..!
మహేష్ బాబు అభిమానులకు శుభవార్త!