త్రిబుల్ రోల్ లో నాని.. ఎలా ఉంటాడో ఊహించండి

nani triple Role action

నాని మంచి సక్సస్ రేటున్న హీరో. వరుస విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్న నానికి కృష్ణార్జున యుద్ధ గట్టి బ్రేక్ వేసింది. అయినా నాని ఏమాత్రం తన స్పీడ్ తగ్గించలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ – 2 కి హోస్ట్ గా చేస్తూనే నాగర్జున తో కలి “దేవదాస్” అనే మల్టిస్టారర్ లో చేస్తుంన్నాడు. ఈ సినిమానే కాక మరో రెండు మూడు సినిమాలను నాని ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.

మళ్లీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమాకు నాని గ్రీన్ సిగ్నెల్ ఇవ్వగా.. ఈ సినిమాలో నాని త్రిపాత్రాభినయం చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు డబల్ యాక్షన్ సినిమా చేసిన నాని మొదటి సారి త్రిబుల్ యాక్షన్ లో కనిపించనున్నాడట.

అయితే ఇప్పటికే “జై లవ కుశ” సినిమాతో ఎంత పెద్ద విజయాన్ని అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు నాని సినిమా కూడా ఎన్టీఆర్ సినిమాలా విజయం నమోదు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఒక పాత్ర గురించయితే కొంత వరకూ వస్తున్న సమాచారం ప్రకారం కాలేజ్ విద్యార్థి కం యంగ్ క్రికెటర్ నాని కనిపించనున్నాడట. ఇంకా ఈ సినిమాకు సంబందించి పూర్తివివరాలు తేలియాల్సివుంది.

nani triple Role action :