#RRR తరువాత ఎన్టీఆర్ సినిమా ఆ డైరెక్టర్ తోనే..చూస్తే మైండ్ బ్లాక్!

ntr news

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో #RRR సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.. అయితే #RRR సినిమా తరువాత ఎన్టీఆర్ ఎవరితో సినిమా చేస్తారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

రాజమౌళి తో సినిమా చేస్తున్న సినిమా దాదాపుగా ఏడాదిన్నర సమయం పట్టేలావుంది. అసలే ఎన్టీఆర్ టెంపర్ సినిమా తరువాత వరుస విజయాలతో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపగా.. తాజాగా వచ్చిన అరవింద సమేత సినిమాతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసాడు.

ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ #RRR సినిమా తరువాత వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడనె వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే వి.వి.వినాయక్ , ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎటువంటి సినిమా వస్తుంది అనేది తెలియాల్సి ఉండగా..
అదుర్స్ సినిమా సిక్వల్ గా అదుర్స్ 2 రావచ్చని కూడా టాక్ వినిపిస్తోంది.

Telugu Movie News: Ntr Doing New Movie With His Old Director