దుమ్ములేపుతున్న “ఎన్టీఆర్ కథానాయకుడు” బిజినెస్

స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా ఎంతో ప్రతిస్టాత్మకంగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ కు ముందే దుమ్ములేపుతున్న ఈ సినిమా రిలీజ్ తరువాత ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ ఇప్పటికే విడుదలై 2018 లో బాక్స్ ఆఫీస్ సంచలనంగా నిలిచిన “మహానటి” అంతకుమించిన అంచనాలతో వస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత వసూలు చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం “ఎన్టీఆర్ కథానాయకుడు” ఉత్తరాంద్ర మరియు కృష్ణా లో కలిపి 11.40 కోట్ల బిజినెస్ చేయగా..

గుంటూరులో మరో 6 కోట్లు, ఈస్ట్ 5.40 కోట్లు , వెస్ట్ 4.20 కోట్లు , నెల్లూరు 2.50 కోట్లు మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో 55 కోట్ల వరకు బిజినెస్ చేసిన ఈ సినిమా రూరల్ ఏరియాలో 6.30 కోట్లు అలగే ఓవర్సీస్ లో 10 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా “ఎన్టీఆర్ కథానాయకుడు” వరల్డ్ వైడ్ గా 71.30 కోట్ల బిజినెస్ చేసింది.

Related Posts :

ఎన్టీఆర్ బయోపిక్ సెన్సార్ రివ్యూ !

2018 టాలీవుడ్ టాప్ 5 బిగ్గెస్ట్ ఓపెనర్స్ ఇవే!

ఎన్టీఆర్ కాతాలో సరికొత్త రికార్డు..ఈ దెబ్బతో ఫాన్స్ కి పూనకాలు కాయం!

2018 ఓవర్సీస్ లో దుమ్ములేపిన టాప్ తెలుగు సినిమాలు ఇవే!

Telugu Movie News : Ntr biopic kathanayakudu business