ఈ దెబ్బతో ఎన్టీఆర్ బయోపిక్..బాక్స్ ఆఫీస్ సునామీ కాచుకోండి!

యువ హీరోలకు గట్టి పోటీనిస్తూ తాను ఏ మాత్రం తక్కువకాదు అనేలా నటనతో దుమ్ములేపే బాలయ్య తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ బయోపిక్ ను రెండు భాగాలుగా చేస్తుండగా మొదటి భాగం “ఎన్టీఆర్ కథానాయకుడు” జనవరీ 9న విడుదలకు సిద్ధమవుతుండగా మరో భాగం “ఎన్టీఆర్ మహానాయకుడు” ఫిబ్రవరి 7న విడుదల కానుంది.

ntr biopic updateసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ బయోపిక్ కు క్రిష్ తో పాటు బాలకృష్ణ కూడా దర్శకత్వంవహించారనె టాక్ గట్టిగా వినిపిస్తోంది. అప్పట్లో నర్తనశాల అనే సినిమాను దర్శకుడుగా ప్రారంభించిన బాలయ్య ఆ సినిమాలో ద్రౌపదిగా సౌందర్యని తీసుకున్నారు. కొత్త షూటింగ్ పూర్తయినతరువాత ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె మరణించడంతో ఆ సినిమా అప్పుడే ఆగిపోయింది.

ntr kathanayakuduతన తండ్రి ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలకు బాలయ్య అసిస్టంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అయితే మరో సారి తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ ను తెరకెక్కించడంలో బాలయ్య తన డైరెక్షన్ కు పదును పెట్టాడట..కాగా అందులోనూ అన్నగారి సినిమా కాబట్టి ఈ సినిమాపై ఉన్న అంచనాలు రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలయిన పాటలు , ట్రైలర్, కొన్ని ప్రోమోలు మరియు ఫస్ట్ లుక్ స్టిల్స్ ఈ సినిమాను ఎక్కడికొ తీసుకుపోతున్నాయి అనడంలో ఎటువంటి సందేహంలేదు.

Related Posts:

ఈ దెబ్బతో ఎన్టీఆర్ బయోపిక్..బాక్స్ ఆఫీస్ సునామీ కాచుకోండి!

వినయ విధేయ రామ సెన్సార్ రివ్యూ..ధియేటర్స్ లో పూనకాలు కాయం!

దుమ్ములేపుతున్న “ఎన్టీఆర్ కథానాయకుడు” బిజినెస్

2018 టాలీవుడ్ టాప్ 5 బిగ్గెస్ట్ ఓపెనర్స్ ఇవే!

ఎన్టీఆర్ కాతాలో సరికొత్త రికార్డు..ఈ దెబ్బతో ఫాన్స్ కి పూనకాలు కాయం!

Telugu Movie News : #NTRKathanayakudu #NandamuriBalakrishna #NTRBiopic