“ఎన్టీఆర్ కథానాయకుడు”కి భారీ దెబ్బ..నష్టాలు చూస్తే మైండ్ బ్లాక్!

ntr kathanayakudu latest news

ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న విడుదలవ్వగా.. సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ తెచ్చుకున్నా.. కలెక్షన్స్ పరంగా ఎన్టీఆర్ కథానాయకుడుకి భారీ నిరాశే మిగిలింది.

ఎన్టీఆర్ కథానాయకుడు రెండు తెలుగు రాష్ట్రాలలో 54.58 కోట్ల బిజినెస్ చేయగా.. టోటల్ వరల్డ్ వైడ్ గా 70.58 కోట్ల బిజినెస్ చేసింది. కానీ ఇప్పటివరకు కేవలం వరల్డ్ వైడ్ గా 20 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ వసూలు చేయగా..ఇంకా 50 కోట్లు ఈ సినిమా వసూలు చేయాల్సి ఉంది.

సినిమా ఇప్పటికే ఫుల్ రన్ కంప్లీట్ చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాను భారీ రేట్లు పెట్టి కొన్న బయ్యర్లకు ఈ సినిమా పట్టపగలే చుక్కలు చూపించింది. బాలయ్య దెబ్బకు భారీ నష్టాలతో బయ్యర్లు బోరుమంటున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ కథానాయకుడు ఫుల్ రన్ లో నైజాం ఏరియాలో 13 కోట్లకు కేవలం 3 కోట్ల మాత్రమే వసూలు చేసి గట్టి దెబ్బకొట్టింది. ఇక సీడెడ్ ఏరియా పరిస్థితి నైజాం కంటే దారుణంగా ఉంది. సీడెడ్ ఏరియాలో “ఎన్టీఆర్ కథానాయకుడు” 12 కోట్లకు అమ్ముడుపోగా..

అక్కడ మొత్తం లాంగ్ రన్ లో కేవలం 1.8 కోట్లు మాత్రమే వసూలు చేసి భారీ నష్టాలను మూటగట్టుకుంది.అయితే ప్రస్తుతం “ఎన్టీఆర్ కథానాయకుడు” ప్రభావం ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాపై గట్టిగా పడనుంది.

ఇప్పటికే వస్తున్న సమాచారం ప్రకారం బాలయ్య ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాను “ఎన్టీఆర్ కథానాయకుడు” సినిమాను కొన్న బయ్యర్లకు ఫ్రీగా ఇవ్వనున్నాడనే సమాచారం గట్టిగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా నష్టాలను ఎన్టీఆర్ మహానాయకుడు గట్టెక్కిస్తుందేమో..చూడాలి.

Telugu Movie News: ntr kathanayakudu total box office collections

Related Posts: