పట్టాలెక్కిన #RRR..తారక్ , చెర్రీకి నో బ్రేక్

rrr latest update

ఎట్టకేలకు తాజాగా ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈమధ్యనే ముహూర్తపు కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమా తాజాగా హైదరాబాద్‌లో షూటింగ్ ను ప్రారంభించారు. బాహుబలి వంటి పెద్ద పెద్ద సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకుపోయిన రాజమౌళి తాజాగా ఆర్.ఆర్.ఆర్ కు కూడా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటిస్తుండడం తో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశానంటాయి. ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం ఆర్.ఆర్.ఆర్ 500 కోట్ల కు పైగా బిజినెస్ చేయనుందని సమాచారం.

Telugu Movie News : NTR , Ramcharan #RRR Latest Update