పడి పడి లేచే మనసు ౩వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..మైండ్ బ్లాక్!

padi padi leche manasu

యంగ్ హీరో శర్వానంద్ సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పడి పడి లేచే మనసు. ఈ సినిమాపై విడుదలకు ముందునుంచే మంచి అంచనాలు ఉన్నప్పటికీ విడుదల తరువాత ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద ఒకంత ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి.

సినిమా పరంగా పర్వాలేదు అనే టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమాకు పోటీగా మరో 4 సినిమాలు విడుదలవ్వడంతో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అనుకున్న స్థాయిలో రాలేదు. అయితే 22.8 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా 23.5 కోట్లను బాక్స్ ఆఫీస్ వద్ద వసూలు చేయాల్సి ఉండగా..ఈ సినిమా మొదటి ౩ రోజుల కలెక్షన్స్ నిర్మాతలకు షాకిస్తున్నాయి.

పడి పడి లేచే మనసు రెండు తెలుగు రాష్ట్రాలలో 4.3 కోట్ల షేర్ వసూలు చేయగా ఓవర్సీస్ లో 70 లక్షల వరకు షేర్ వసూలు చేసింది. ఎట్టలేద్నా మొదటి వీకెండ్ మొత్తం మీద షేర్ 5 కోట్ల మార్క్ ని అందుకుంది ఈ సినిమా. మరికొన్ని రోజుల్లో బాక్స్ ఆఫీస్ బరిలోకి పెద్ద సినిమాలు వస్తుండడంతో ఏదయినా ఉంటే ఇంకొన్ని రోజులు మాత్రమే ఈ సినిమాకు అవకాశముంటుంది.

కాగా అది కూడా ఇతర సినిమాల నుండి గట్టి పోటీని తట్టుకుంటూ.. మరో 18కోట్ల షేర్ వసూలు చేయడం అంటే అసాధ్యంగా అయ్యేందుకు ఎక్కువగా ఉండడంతో పడి పడి లేచే మనసు సినిమా శర్వానంద్ ఖాతాలో ఫ్లాఫ్ మారుతుందంటున్నారు.

Related Posts:

అంతరిక్షం ౩వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇవే!

ఓవర్సీస్ లో మేత మోగిస్తున్న కేజియఫ్

వినయ విధేయ రామ ట్రైలర్ ఆ రోజే రానుందట!

Telugu Movie News : padi padi leche manasu 4 dasy box office collections