త్వరలో తల్లి కాబోతున్న ప్రియమణి

priyamani is going to become moter soon

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగిన ప్రియమణి.. తెలుగు సినిమాలకు దూరమై చాలా కాలమే అవుతోంది. ప్రస్తుతం ఈమె ‘ఢీ 10’ డాన్స్ రియాలిటీ షోకి జర్జ్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ప్రియమణి గత ఏడాది ముస్తఫారాజ్‌తో అనే పారిశ్రామికవేత్త ను పెళ్లి చేసుకున్నారు. పెళ్ళికి ముందు కొన్ని కన్నడ సినిమాలను ఒప్పుకోవడంతో పెళ్ళయిన రెండు మూడు రోజులకే షూటింగ్ లో పాల్గొనవలసి వచ్చింది.

ఆ సినిమాల తరువాత ఢీ 10’ డాన్స్ షోకి జర్జ్ గా చాన్స్ రావడంతో మల్లి బిజీ అయిన ఆమెకు కట్ చేస్తే ఇన్నాలకు బ్రేక్ దొరికింది. అయితే ప్రియమణి కొన్ని రోజులు విరామం తీసుకోవాలని డిసైడయ్యారట. ఆమె విరామం తీసుకోవదానికి కూడా భాలమయిన కారణముందంటున్నారు సినీజనాలు. ప్రస్తుతం ప్రియమణి కడుపుతో ఉందని త్వరలోనే ఆమె తల్లి కాబోతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలకు బలం చేకూరేలా ప్రియమణి చేసిన పోస్ట్ లు కూడా చేస్తుంన్నారు. “త్వరలో మా నుంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జయిటింగ్ న్యూస్ రాబోతుంది. వెయిట్ అండ్ వాచ్” అని ప్రియమణి భర్త ముస్తఫారాజ్‌ పోస్ట్ చేశారు.

priyamani is going to become moter soon :