పేట టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..దిమ్మతిరిగే షాక్ ఇది!

77

Rajnikanth PETTA total Box Office collections:

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా “2.0 ” వంటి భారీ విజయం తరువాత వచ్చిన లేటెస్ట్ మూవీ పేట. వింటేజ్ రజినీ ని మళ్ళీ అభిమానులకు పరిచయం చేసి అభిమానులను మెప్పించినా కానీ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పోటీ ఎదురవడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే లెవల్లో కాకున్నా మినిమమ్ కలెక్షన్స్ వసూలు చేసి తమిళనాట బ్రేక్ ఈవెన్ అవ్వగా..

తమిళ్ లో విశ్వాసం నుండి తీవ్ర పోటి ఎదురయినా ఆ పోటీని తట్టుకొని తమిళ్ వర్షన్ పరంగా సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వగా.. తెలుగు వర్షన్ పరంగా మాత్రం చెప్పుకోదగ్గ మంచి విజయాన్ని అందుకోలేకపోయింది. సంక్రాంతి కానుకగా ముందుగా ఎన్టీఆర్ మహానాయకుడు, ఆ తరువాత వినయ విధేయ రామ , F2 సినిమాలు రాగా వాటి మధ్యలో వచ్చిన పేట సినిమాకు అనుకున్న రేంజ్ లో థియేటర్స్ దొరకకపోవడం

అలాగే వరుసగా మూడు పెద్ద సినిమాలు పేట సినిమాకు గట్టి పోటీ ఇవ్వడంతో సినిమాలో కంటెంట్ దుమ్ములేపే రేంజ్ లో ఉన్నా పేట తెలుగు వర్షన్ కి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో రాలేదు. సినిమా వరల్డ్ వైడ్ గా 124 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరగ్గా 240 కోట్ల గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగగా వరల్డ్ వైడ్ గా 228.7 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

పేట సినిమా ఏరియాల వారీగా సాదించిన గ్రాస్ కలెక్షన్స్ పరిశిలిస్తే..

Tamil Nadu – 118 Cr

Telugu States – 9.7 Cr

Karnataka – 18.4 Cr

Kerala – 8 Cr

ROI – 5.18 Cr

Overseas – 69.50 Cr

Total worldwide gross 228.78Cr.

Related Posts: