మరో ఆల్ టైం రికార్డు: క్రియేట్ చేసిన రామ్ చరణ్!

111

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా సరికొత్త రికార్డు క్రియేట్ చేసాడు. రామ్ చరణ్ హీరోగా సమంత హీరొయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త రికార్డులను సృష్టించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా తాజాగా మరో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది.

ఇంతకి ఆ రికార్డు ఎంటంటే..? మహాశివరాత్రి కానుకగా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఈ సినిమాను ప్రదర్శించగా 1లక్షా 40 వేలు రూపాయలు రెండు స్క్రీన్లకు కలిపి వసూలు చేసి ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. ప్రతి సంవత్సరం శివరాత్రి స్పెషల్ గా వేసే ఏ సినిమాకు కూడా ఇంత పెద్ద మొత్తంలో రాలేదట. అయితే ఈ సినిమా ఈ రేంజ్ లో ఇప్పటికి దుమ్ములేపుతుందంటే అది మామూలు విషయం కాదనే చెప్పాలి.

Telugu Movie News: Ram Charan Creating All Time New Record

Related Posts:

చివరి దశలో “లక్ష్మీస్ ఎన్టీఆర్”

ఎన్టీఆర్ రామ్ చరణ్ ల మధ్య భారీ ఫైట్ సీన్..చూస్తే బిత్తరపోతారు!

#RRR లో ఎన్టీఆర్ కుమ్ముడు మొదలైంది!