ఒక ప్లాప్ సినిమాతో 100 మిలియన్ క్లబ్ లో రామ్ చరణ్!

ram charan flop movie joins in 100 milion club:

ram charan flop movie joins in 100 milion club
ram charan flop movie joins in 100 milion club

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ రామ్ చరణ్ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు. 2010లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భాస్కర్ దర్శకత్వంలో జెనీలియా హీరోయిన్ గా వచ్చిన సినిమా “ఆరెంజ్”. అప్పట్లో మగధీర సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేసిన రామ్ చరణ్ తరువాతి సినిమా ఆరెంజ్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాసినిమా కథ అడ్వాన్సుడ్ ఉండడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయం పాలయిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా వెండితెరపై పరాజయంగా మిగిలినా బుల్లితెరపై మాత్రం ఇప్పటికి ఈ సినిమాకు క్రేజ్ తగ్గలేదంటే అతిశెయోక్తి లేదని చెప్పొచ్చు. అయితే ఈ సినిమా “రామ్ కి జంగ్” అనే టైటిల్ తో హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో వదలగా దుమ్ములేపే వ్యూస్ ఈ సినిమా సొంతం చేసుకుంది. ఏకంగా ఈ సినిమా 100 మిలియన్ క్లబ్ లోకి చేరడంతో అక్కడివారికి ఈ సినిమా ఎంత బాగా నచ్చిందో అర్ధంచేసుకోవచ్చు.

ప్రస్తుతం రామ్ చరణ్ ఎన్టీఆర్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో #RRR సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా రామ్ చరణ్ సరసన హీరొయిన్ గా ఆలియా బట్ నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శేరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా 2020 సమ్మర్ కానుకగా జూలై 30 ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts: