“సైరా” కోసం రంగంలోకి దిగుతున్న రామ్ చరణ్..!

96

మెగాస్టార్ చిరంజీవి ఖైధీ నెంబర్ 150 రీఎంట్రీ ఇవ్వగా అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలు కొడుతూ ఖైధీ నెంబర్ 150 సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అయితే తాజాగా చిరూ 151 వ సినిమాగా “సైరా నరసింహా రెడ్డి” సినిమా వస్తుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ ఎత్తున ఈ సినిమా తెరకేక్కుతుండడంతో ఈ సినిమాకు నిర్మాతగా రామ్ చరణ్ వ్యవహరిస్తున్నాడు.

అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం సైరా రిలీజ్ కు టైమ్ దగ్గర పాడుతుండడంతో ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చరణ్ భారీగా ప్లాన్ చేస్తున్నాడట. రామ్ చరణ్ హోస్ట్ గా ఈ సినిమా టీమ్ తో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూని నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారట. అయితే ఇక ఆ తరువాత నుండి ఈ సినిమా గురించి అప్డేట్ల మిద అప్డేట్ల రానున్నట్టు సమాచారం. మెగాస్టార్ చిరంజీవి సరసన హీరొయిన్ గా నయనతార నటిస్తుండగా బిగ్ బి అమితాబ్,కిచ్చ సుదీప్,విజయ్ సేతుపతిలు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Related Posts:

Telugu Movie News: ram charan going to be host for Sye Raa promotions