లీక్ అయిన చరణ్ పోలీస్ స్టేషన్!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ కంబినేష్ లో భారీ ఎత్తున తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ #RRR. బాహుబలి వంటి భారీ సినిమాల తరువాత రాజమౌళి ఎంతో ప్రతిస్తాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే మొదటి షడ్యుల్ పూర్తి చేసుకొని రెండవ షడ్యుల్ జరుపుకుంటున్న ఈ సినిమా నుండి చిన్న అప్డేట్ కూడా భయటకు రాకుండా రాజమౌళి ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు షూటింగ్ నుండి ఒక ఫోటో లికయియిందంటూ..

#RRR సినిమాలో రామ్ చరణ్ పనిచేసే బ్రిటీష్ కాలంనాటి పోలీస్ స్టేషన్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఎన్టీఆర్ బందిపోటుగా కనిపించనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

తాజాగా సినీవర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ చరణ్ – తారక్ లోతో ఒక సాంగ్ పాడించనున్నారట. అయితే ఈ సాంగ్ కు సంభందించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉండగా.. ఈ సాంగ్ లో టాప్ సింగర్స్ తో కోరస్ అందుకుంటారని టాక్.

అయితే ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం రెండవ షెడ్యూల్ జరుపుకుంటుంది. అయితే ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు విడివిడిగా పాల్గొంటున్న సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు.

ముందుగా రామ్ చరణ్ పై కొన్ని సీన్స్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ షూట్ లో 1000 మందితో చరణ్ ఫైట్ ను ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాకు ఈ ఫైట్ సీన్ హైలైట్ కానుండగా.. ఇంకా ఇలాంటి హైలైట్ సీన్స్ చాలా ఉన్నాయని సమాచారం.