ఎన్టీఆర్ రామ్ చరణ్ ల మధ్య భారీ ఫైట్ సీన్..చూస్తే బిత్తరపోతారు!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ #RRR. బాహుబలి వంటి భారీ విజయం తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మొదటి రెండు షెడ్యూల్లను పూర్తీ చేసుకున్న ఈ సినిమా తాజాగా మూడవ షెడ్యూల్ జరుపుకుంటుంది.

కొన్ని రోజులు తారక్ తో ఈ షెడ్యూల్ హైదరాబాదు లో జరగ్గా తాజాగా ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ నేడు కోల్కతా లో మొదలుట. సుమారుగా 10 నుండి 15 రోజుల పాటు జరగబోయే ఈ షూటింగ్ లో మొదట ఎన్టీఆర్ పాల్గొని ఆ తరువాత క్కడే రామ్ చరణ్ తో ఎన్టీఆర్ తో కలిపి మరికొన్ని సీన్స్ చేయనున్నారట.

అయితే అక్కడ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ ల మధ్య భారీ ఫైట్ సీన్ షూట్ చేయనున్నారట.  25 రోజుల కి పైగా ఈ షెడ్యూల్ కోల్కతా లో జరగనుంది. ఇప్పటికి ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరు అన్నది సస్పెన్స్ గా నిలవగా ఈ సినిమాను 2020 సమ్మర్ కానుకగా విడుదలకు సిద్దం చేస్తున్నారు.

యావత్ భారతదేశం ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది. మార్చ్ 27 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ కు సంభందించిన ఫస్ట్ లుక్ టీజర్ విడుదల చేయనున్నారట.

Telugu Movie News: #RRR NTR Ram Charan fight scene update