బాక్సాఫీస్ దిమ్మతిరిగే షాకిస్తున్న RRR ఓవర్సీస్ రైట్స్..?

99

rrr record price in overseas rights:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుదు రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ #RRR. ఈ సినిమా బాహుబలి అంతటి భారీ విజయం తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం అలాగే టాలీవుడ్ గట్టి మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు హీరోలు నటిస్తుండంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంది.

ప్రస్తుతం ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ దిమ్మతిరిగే రేంజ్ లో ఉండబోతున్నాయట. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ఈ సినిమా మేకర్స్ ఓవర్సీస్ లో ఈ సినిమా రైట్స్ కోసం 75 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నార. ఈ రేంజ్ లో ఓవర్సీస్ రైట్స్ అంటే అది మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ బయటకు రాలేదు.

కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంభందించిన ఫస్ట్ లుక్ మరియు సినిమా టైటిల్ వివరాలు అలగే ఈ సినిమాలోని ఇతర వివరాలు త్వరలోనే సినిమా యూనిట్ అఫీషియల్ ప్రెస్ మీట్ లో బయటపెట్టనుంది. ఇప్పటికే మొదటి రెండు షడ్యూల్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షడ్యూల్ జరుపుకుంటుంది. ఈ షడ్యూల్ కోల్కతాలో జరుగుతుండగా.. ఈ షడ్యూల్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Related Posts: