“ఆర్ఆర్ఆర్” లో ఎన్టీఆర్ కి జోడిగా శ్రద్ధాకపూర్!

shradda kapoor to star in rrr:

shradda kapoor to star in rrr
shradda kapoor to star in rrr

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ #RRR. ఈ సినిమాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ లు హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకోనగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంన్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బ్రిటన్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ నటించనుందని రాజమౌళి చెప్పగా.. ఆ తరువాత కొన్ని కారణాలవలన డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ RRR ప్రాజెక్ట్ నుండి తప్పుకుంన్నట్టు రాజమౌళి అధికారికంగా ప్రకటించారు.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారగా.. కొంత మంది హీరోయిన్స్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పరిణీతి చోప్రా, నిత్యా మీనన్ వంటి హీరోయిన్స్ పేర్లు వినిపిస్తుండగా.. తాజాగా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పేరు గట్టిగా వినిపిస్తోంది.

ఒకరకంగా ఈమే అల్ మోస్ట్ ఈ సినిమాలో కన్ఫామ్ అయిపోయినట్టే అని సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. అయితే ప్రస్తుతం శ్రద్ధా కపూర్ సాహో సినిమాలో నటిస్తోంది. రామ్ చరణ్ కు కాలికి గాయం కావడం కారణంగా ప్రస్తుతం #RRR సినిమా షూటింగ్ ఆగిపోయింది. అయితే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి 2020 మే 9న రిలీజ్ కు సిద్దం చేస్తున్నారు.

Telugu Movie News: