AA19 లో అదిరిపోయే లుక్ లో బన్నీ

106

stylish star allu arjun AA19 latest look:

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కి ఇది 19వ సినిమా కావాడం తో అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తన మూడవ సినిమా కావడంతో బన్నీ ఈ సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడట. ఇప్పటికే చాలా వరకు బరువు తగ్గి స్లిమ్ గా తయారయిన బన్నీ ఈ సినిమాలో సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు.

ముందే బన్నీ ఒక కొత్త సినిమా చేస్తున్నారంటే బన్నీ లుక్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి అభిమానుల్లో కలగక మానదు. అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో ఎలాగయినా హ్యాట్రిక్ కొట్టేందుకు గట్టిగానె కష్టపడుతున్నారు. ఇప్పటికే త్రివిక్రమ్ పక్కా స్క్రిప్ట్ రెడీ చేస్తుండగా.. మరో పక్క అల్లు అర్జున్ తన లుక్ సరికొత్తగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

అయితే ఈ సినిమాతో పాటుగా బన్నీ మరో సినిమాను కూడా సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు.
సుకుమార్ తో బన్నీ చేయబోయే సినిమా కూడా హ్యాట్రిక్ సినిమానే కావడంతో ఈ సినిమాపై కూడా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. నాపేరు సూర్య వంటి భారీ పరాజయం తరువాత ఇప్పటివరకు సినిమాలకు దూరంగా ఉన్న బన్నీ ఒకే సారి రెండు సినిమాను సిద్దం చేస్తున్నారు.

Related Posts: