వర్మకు దిమ్మతిరిగే షాకిచ్చిన సుప్రీం కోర్ట్!

Supreme court reject Lakshmis NTRs petition:

RGV Laxmis Ntr Gets Huge Collections Than Balayya NTR Biopic
RGV Laxmis Ntr Gets Huge Collections Than Balayya NTR Biopic

లక్ష్మీస్ ఎన్టీఆర్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను ఆంధ్రప్రదేశ్ లో సినిమాపై ఏప్రిల్ 3 వరకు స్టే ఇచ్చారు. ఇప్పటికే సూపర్ టాక్ తో సినిమా మంచి కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద దుసుకుపోతుంది.

అయితే తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాతలు సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించగా వారికీ అక్కడ దిమ్మతిరిగే షాక్ ఎదురయింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాతలు సుప్రీం కోర్ట్ స్టే ను ఎత్తివేయాలని దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్ట్ స్పందించింది. అంత అత్యవసరంగా విచారన చేయాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్ట్ పిటిషన్ ను తిరస్కరించింది.

ఎన్నికలకు ముందే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్న రామ్ గోపాల్ వర్మకు సుప్రీం కోర్ట్ లో గట్టి దెబ్బే తగిలింది. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఇంకా ఓకొలిక్కి రాలేదనే చెప్పాలి.

Related Posts:

Lakshmis NTR, Varma, RGV, Supreme Court, Tollywood