సైరా విషయంలో చిరు భారీ జాగ్రత్త!

sye raa

చిరంజీవి హీరోగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే సైరా కోసం ఇటు చిరూ తో పాటుగా ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరుస్తున్న రామ్ చరణ్ ఎంతో కష్టపడుతున్నారు. సినిమాలో షూటింగ్ విషయంలో ఎక్కడ ఏచిన్న తప్పు జరిగినా.. మల్లీ రీ షూట్ చేస్తున్నారు.

తాజాగా విడుదలయిన బాలీవుడ్ సినిమా మణికర్ణిక బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో
ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం సైరా విషయంలో ఆటువంటి తప్పులు జరగకూడదని మణికర్ణిక సినిమాను సైరా టీమ్ ఎంతో శ్రద్దగా చూసారట. అయితే మణికర్ణిక సినిమాను సైరా టీమ్ చూడడం వలన అది సైరా నరసింహారెడ్డి విజయనికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

Telugu Movie News: Sye Raa Narasimha Reddy Latest Update