మెగా మరియు నందమూరి అభిమానులకి పూనకాలు తెప్పించే వార్త!

209

#RRR Movie Latest Update:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు రాజమౌళి దర్శకత్వంలో #RRR మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా నుండి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ బయటకు రాలేదు. కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు సంభందించిన ఫస్ట్ లుక్ మరియు సినిమా టైటిల్ వివరాలు అలగే ఈ సినిమాలోని ఇతర వివరాలు త్వరలోనే సినిమా యూనిట్ అఫీషియల్ ప్రెస్ మీట్ లో బయటపెట్టనుంది.

బాహుబలి అంతటి భారీ విజయం తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం అలాగే టాలీవుడ్ గట్టి మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు హీరోలు నటిస్తుండంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనే ఆసక్తి ప్రతి ఒక్కరిని వెంటాడుతూ ఉంది. ఇప్పటికే మొదటి రెండు షడ్యూల్లను పూర్తి చేసుకున్న ఈ సినిమా మూడవ షడ్యూల్ జరుపుకుంటుంది. ఈ షడ్యూల్ కోల్కతాలో జరుగుతుండగా.. ఈ షడ్యూల్లో ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Related Posts: