పవన్ కళ్యాణ్ సినిమా అక్కడ అట్టర్ ప్లాప్ అయ్యింది..

pawan kalyan

పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన “అత్తారింటికి దారేది” సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా టాలీవుడ్ లో అప్పటివరకు ఉన్న పాత రికార్డులన్నిటినీ తిరగరాసి సరికొత్త రికార్డ్స్ నెలకొలిపింది.

అయితే ఇలా టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అత్తారింటికి దారేది సినిమాను తాజాగా.. “రాజవతాన్ వరువేన్” అనే పేరుతో తమిళం లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా మొదటి షో నుండే నెగిటీవ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. డిజాస్టర్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద నడుస్తోంది.

pawan kalyan attarintiki daredi remake flop in tamil

అయితే తెలుగులో అత్తారింటికి దారేది సినిమా ఎలా ఉందో..సేమ్ టూ సేమ్ దించడానికి ట్రై చేసారు కానీ ఈ ప్రయత్నం బాక్స్ ఆఫీస్ వద్ద బెడిసికొట్టింది. ఇక్కడ బ్లాక్ బస్టర్ అయిన అత్తారింటికి దారేది అక్కడ “రాజవతాన్ వరువేన్” పేరుతో తుస్సుమంది.