అక్కడ ఇక 1.5 కోట్లు వసూలు చేస్తే..బ్లాక్ బస్టర్ హిట్ పక్కా..!

Vinaya Vidheya Rama Day 20 Box Office Collections

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ జనవరి 11న విడుదల కాగా మొదటి ఆట నుండే నేగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలకు ముందు నుండే భారీ అంచనాలు ఉన్నాప్పటికీ మొదటి రోజు నుండే నేగిటివే టాక్ స్ప్రెడ్ కావడంతో వినయ విధేయ రామ మొదటి 8 రోజుల్లో దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేయగా..

పండుగ సెలవుల తరువాత మొదటి రెండు వారాల కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవనే చెప్పాలి. ప్రస్తుతం సినిమా 18 రోజులను పూర్తిచేసుకోగా.. సినిమా మొదటి రెండు వారాల్లో వరల్డ్ వైడ్ గా 62.5 కోట్ల మార్క్ ని అందుకుంది.

అయితే ఇక పక్క రాష్ట్రo కర్ణాటక లో సినిమాను 7.2  కోట్లకు అమ్మితే ఇప్పటివరకు సినిమా అక్కడ 5.7కోట్ల షేర్ కలెక్షన్స్ ని రాబట్టింది. మరో 1.5 కోట్లు వసూలు చేస్తే అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. వినయ విధేయ రామ సినిమాను వరల్డ్ వైడ్ గా టోటల్ గా 90 కోట్లకు అమ్మగా 91 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటివరకు 63 కోట్లు రేంజ్ లో షేర్ వసూలు చేయగా.. సినిమా ఇంకా బాక్స్ ఆఫీస్ వద్ద మరో 27 కోట్ల వరకు షేర్ వసూలు చేయాల్సివుంది.

Telugu Movie News: Vinaya Vidheya Rama 20 Days Box Office Collections in karnataka