వినయ విధేయ రామ ట్రైలర్ ఆ రోజే రానుందట!

vinaya vidheya rama

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ. ఇప్పటికే విడుదలయిన టీజర్ మరియు సాంగ్స్ తో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోగా.. ఎపటినుండో ఈ సినిమా ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది ఒకంత గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

ఇప్పటికే ఈ సినిమా భారీ అంచనాలు పెట్టుకున్న రామ్ చరణ్ అభిమానులు ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా ఈ నెల 27న సాయంత్రం 6 గంటలకు పోలిస్ గ్రౌండ్ యూసఫ్ గూడా లో సినిమా ఆడియో రిలీజ్ భారీఎత్తున జరపనున్నారట.

అయితే ఈ సినిమా ఆడియో వేడుకకు స్పెషల్ గెస్ట్ గా ఎవరు వస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారగా.. ఈ సినిమా ట్రైలర్ ను డిసెంబర్ 31న సాయంత్రం విడుదల చేస్తారని సమాచారమయితే ఉందికానీ..అదీ ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది.

Related Posts:

వినయ విధేయ రామ ఇంటర్వల్ ఫైట్..చూస్తే పూనకాలే!!

ప్రభాస్ దర్శకుడితో చిరూ సినిమా

Telugu Movie News : vinaya vidheya rama audio release date