దేవర సినిమా నుండి ఇప్పటికే ఎన్టీఆర్ లుక్ రిలీజ్ అవ్వగా.. ఎన్టీఆర్ లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉండడంతో దేవర సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే తాజాగా దేవర సినిమా లో విలన్ గా చేస్తున్న సైఫ్ అలి ఖాన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు. సైఫ్ అలి ఖాన్ ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉంది.
ఎన్టీఆర్ కెరీర్లోనే భారీ యాక్షన్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని తెలిసింది. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్లో తండ్రి పాత్రను రివీల్ చేస్తారని, ఇందులో ఎన్టీఆర్ 60 ఏళ్ల పెద్దమనిషిగా కనిపిస్తారని అంటున్నారు. రొమాంచితమైన యాక్షన్, అదే స్థాయి ఎమోషన్స్‌తో దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని తెలుస్తుంది.